గెలుపుబాట పట్టాలని..!

ABN , First Publish Date - 2021-01-27T06:56:43+05:30 IST

రామం తర్వాత జరిగిన రెండు టోర్నీ (థాయ్‌లాండ్‌ ఓపెన్‌)ల్లోనూ నిరాశపరిచిన భారత టాప్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఇప్పుడు మెగా ఈవెంట్‌కు సిద్ధమయ్యారు...

గెలుపుబాట పట్టాలని..!

  • టైటిల్‌పై సింధు, శ్రీకాంత్‌ గురి

 

బ్యాంకాక్‌: కరోనా విరామం తర్వాత జరిగిన రెండు టోర్నీ (థాయ్‌లాండ్‌ ఓపెన్‌)ల్లోనూ నిరాశపరిచిన భారత టాప్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఇప్పుడు మెగా ఈవెంట్‌కు సిద్ధమయ్యారు. వీరిద్దరూ బుధవారం నుంచి జరిగే ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. 2018లో ఈ టైటిల్‌ నెగ్గిన సింధు.. గ్రూప్‌ ‘బి’ తరఫున టాప్‌ ర్యాంకర్లు తై జు యింగ్‌, రచనోక్‌ ఇంటాన్‌, పోర్న్‌పవె చొచోవోంగ్‌తో కలిసి పోటీపడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా బుధవారం రెండో సీడ్‌ తై జు (చైనీస్‌ తైపీ)తో సింధు ఆడనుంది. తై జుతో ముఖాముఖి పోరులో 5సార్లు గెలిచిన సింధు.. ఏకంగా 15సార్లు ఓడడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో శ్రీకాంత్‌తోపాటు ఆండ్రెస్‌ ఆంటాన్‌సెన్‌, వాంగ్‌ జు వి, ఎన్‌జి క లాంగ్‌ అంగస్‌ ఆడనున్నారు. తొలి మ్యాచ్‌లో తైపీ షట్లర్‌ వాంగ్‌ జుతో శ్రీకాంత్‌ తలపడనున్నాడు. గ్రూప్‌-ఎ, బిలో టాప్‌-2లో నిలిచిన షట్లర్లు సెమీ్‌సకు అర్హత సాధిస్తారు. ఇక.. బీడబ్ల్యూఎఫ్‌ నిబంధనల ప్రకారం పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల్లో టాప్‌-8 ర్యాంకుల్లో ఉన్న షట్లర్లు మాత్రమే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ ఆడేందుకు అర్హులు. అయితే, ఆయా విభాగం నుంచి ఒక దేశం తరఫున గరిష్ఠంగా ఇద్దరు మాత్రమే ఆడాల్సి ఉంటుంది. దీంతో థాయ్‌లాండ్‌ నుంచి ముగ్గురు షట్లర్లు టాప్‌-8లో ఉండడం, జపాన్‌ స్టార్‌ ఒకుహర గైర్హాజరవడంతో.. సింధు పదో స్థానంలో ఉన్నప్పటికీ చివరి బెర్త్‌గా టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకుంది. ఏడో ర్యాంకర్‌గా శ్రీకాంత్‌ టోర్నీలో ఆడుతున్నాడు. కాగా.. డబుల్స్‌లో భారత షట్లర్లకు ప్రాతినిథ్యం లభించలేదు.


Updated Date - 2021-01-27T06:56:43+05:30 IST