‘ప్రాఫిట్ బుకింగ్’ ఎఫెక్ట్.. మళ్లీ 40 వేల డాలర్ల దిగువకు ?

ABN , First Publish Date - 2022-01-19T01:18:10+05:30 IST

క్రిప్టో కరెన్సీ మరోమారు పతనమైంది. మొన్నటి వరకు వరుసగా లాభపడిన క్రిప్టో సోమవారం నుంచి మళ్లీ కిందకు పడిపోతోంది. క్రితం సెషన్‌లో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 44 వేల మార్కును అధిగమించింది.

‘ప్రాఫిట్ బుకింగ్’ ఎఫెక్ట్.. మళ్లీ 40 వేల డాలర్ల దిగువకు ?

ముంబై : క్రిప్టో కరెన్సీ మరోమారు పతనమైంది. మొన్నటి వరకు వరుసగా లాభపడిన క్రిప్టో సోమవారం నుంచి మళ్లీ కిందకు పడిపోతోంది. క్రితం సెషన్‌లో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 44 వేల మార్కును అధిగమించింది. కాగా... నిన్న(సోమవారం) 43 వేల డాలర్ల దిగువనే ట్రేడవుతోంది. బిట్ కాయిన్ సహా క్రిప్టోలు తాజా గరిష్టాలను నమోదు చేశాక, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రాఫిట్ బుకింగ్ ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఈ క్రమంలో... బిట్‌కాయిన్ మరోమారు 40 వేల డాలర్ల దిగువకు పడిపోయే అవకాశాలు లేకపోలేదని క్రిప్టో నిపుణులు అంచనా వేస్తున్నారు. నలభై వేల డాలర్ల వద్ద బలమైన పరీక్షను ఎదుర్కొంటుందని చెబుతున్నారు. 

Updated Date - 2022-01-19T01:18:10+05:30 IST