Abn logo
Sep 24 2021 @ 14:01PM

జీఎస్‌టీ పరిధిలోనికి రానందువల్లే...

ముంబై : పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గనున్నాయా ? కేంద్రం ఆ దిశగా యోచిస్తోందా ? ఈ ప్రశ్నలకు... ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఇదిలా ఉంటే... పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు  ఆసక్తి చూపించడంలేదని కేంద్రం చెబుతోంది. కాగా... కేంద్రానికి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ. 32 వేల కోట్ల మేర పన్ను రూపేణా సమకూరుతోందని, ఈ నేపధ్యంలోనే... ఆయా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతోందని కేంద్ర మంత్రి ఒకరు  పేర్కొన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో పన్ను ద్వారా వచ్చే ఈ డబ్బుతోనే ఉచిత రేషన్, ఉచిత హౌసింగ్, ఉజ్వల వంటి వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలుగుతున్నట్లు చెప్పారు. 


ధరలు యధాతథం... పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం(సెప్టెంబర్ 24) స్థిరంగా ఉన్నాయి. వరుసగా 19 వ రోజు ధరలు పెరగకపోవడం గమనార్హం. ఇరవై రోజుల క్రితం మాత్రం స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. అప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 19 పైసలు తగ్గి. రూ. 101.19, డీజిల్ పై 15 పైసలు తగ్గి, రూ. 88.77 నుండి రూ. 88.62 గా ఉన్నాయి. ఇక ఆ తర్నాత... ధరల్లో మార్పులేదు. సాధారణంగా ప్రతి నెల ఒకటి, పదిహేను తేదీల్లో చమురు సంస్థలు ధరలను సమీక్షించి, పెంపు లేదా తగ్గింపులను నిర్ణయిస్తాయన్న విషయం తెలిసిందే. 

TAGS: GST GST

ఇవి కూడా చదవండిImage Caption