పాపం.. పసివాళ్లు..!

ABN , First Publish Date - 2022-08-20T05:11:51+05:30 IST

అభం-శుభం తెలియని ఆ చిన్నారులు ఉదయం అమ్మమ్మ, తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆడుకొన్నారు. తాగడానికి పాలు, తినేందుకు టిఫెన్‌ కావాలంటూ అల్లరి చేశారు. అంతలోనే ఆ తల్లి మనసుకు ఏం కష్టమొచ్చిందో ఏమో కానీ చిన్నారులతో కలిసి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది. కుటుంబ సభ్యులు చిన్నారులు వారి ఆచూకి కోసం వెతికేలోపే బావిలో శవాలుగా మారారు. ఈ సంఘటనతో దిగువ బురుజుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

పాపం.. పసివాళ్లు..!
పిల్లలు మౌనిక, పరమేశ్‌ (ఫైల్‌ఫొటోలు)

గుర్రంకొండ, ఆగస్టు 19: అభం-శుభం తెలియని ఆ చిన్నారులు ఉదయం అమ్మమ్మ, తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆడుకొన్నారు. తాగడానికి పాలు, తినేందుకు టిఫెన్‌ కావాలంటూ అల్లరి చేశారు. అంతలోనే ఆ తల్లి మనసుకు ఏం కష్టమొచ్చిందో ఏమో కానీ చిన్నారులతో కలిసి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకొంది. కుటుంబ సభ్యులు చిన్నారులు వారి ఆచూకి కోసం వెతికేలోపే బావిలో శవాలుగా మారారు. ఈ సంఘటనతో దిగువ బురుజుపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.  గుర్రంకొండ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ వివరాల మేరకు.. మండలం లోని టి.రాచపల్లె పంచాయతీ దిగువబురు జుపల్లెకు చెందిన ఓబులేశ్వరి కుమార్తె లావణ్యకు పీలేరు మండలంలోని జాండ్ల గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డితో 2016 అక్టోబరులో పెద్దలు వివాహం జరి పించారు. వీరికి పరమేష్‌ (5), మౌనిక(3) అనే పిల్లలున్నారు. సుబ్రహ్మణ్యంరెడ్డి వృత్తి పరంగా తెలంగాణ రాష్ట్రంలోని బీదర్‌ వద్ద ఓ ప్రైవేట్‌ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్య, పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. నాలుగు నెలల క్రితం భార్య, భర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో లావణ్య స్వగ్రామమైన దిగువ బురుజుపల్లెకు వచ్చింది. కాగా ఈనెల 6న లావణ్య తాత జి.సురేంద్రరెడ్డి మరణించగా, 18న పెద్దకర్మను చేశారు. ఈ కార్యక్రమానికి లావణ్య భర్త సుబ్రహ్మణ్యంరెడ్డి కూడా హాజ రయ్యాడు. ఈ నేపథ్యంలో భార్యను బీదర్‌ కు రావాలని కోరడంతో వీరి మధ్య వాగ్వివా దం జరిగింది. కనీసం కుమారుడైన పరమే ష్‌ను తన వెంట పంపాలని శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్యంరెడ్డి భార్యను అడి గాడు. అయితే ఆ తల్లి మనసుకు ఏ కష్టం వచ్చిందో కానీ ఆడుకుంటున్న పిల్లలను తన వెంట తీసుకెళ్లి గ్రామానికి సమీపంలోని బావిలో ఉదయం 10 గంటలకు దూకేసింది. ఈ ప్రమాదంలో పిల్లలతో సహా లావణ్య కూడా మృతి చెందింది. విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యులు, బంధు వులు, భర్త బావి దగ్గరకు వెళ్లగా అప్పటికే కుమారుడి మృతదేహం తేలుతుండడం చూసి స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకొన్న పోలీసులు, రెస్య్కూ టీమ్‌ సభ్యులు బావి వద్దకు చేరుకొని లావణ్య, మౌనిక మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామ స్థులు, బంధువులు బోరున విలపించారు. దీంతో దిగువ బురుజుపల్లెలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు.





Updated Date - 2022-08-20T05:11:51+05:30 IST