Jul 27 2021 @ 08:03AM

కార్తి సినిమాలో సిమ్రన్..!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ ఓ ముఖ్య పాత్రలో నటించబోతోందని తమిళ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈమె మంచి పాత్ర వస్తే కాదనకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. 'ఖైదీ', 'సుల్తాన్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న కార్తి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నాడు. వీటిలో భాగంగానే ప్రస్తుతం పిఎస్ మిత్రాన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. బబ్లీ బ్యూటీ రాశిఖన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. 'సర్దార్' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఇందులో కార్తి డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నట్టు సమాచారం. అలాగే మరో యంగ్ బ్యూటీ రాజీషా విజయన్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా సిమ్రన్‌కి ఇందులో నటించే అవకాశం వచ్చినట్టు కోలీవుడ్ మీడియా సమాచారం. అయితే సిమ్రన్‌కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం మేకర్స్ నుంచి రావాల్సి ఉంది.

Otherwoodsమరిన్ని...