Abn logo
Aug 3 2020 @ 13:17PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌నటి సిమ్రాన్ చౌదరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అభినవ్‌ గోమటం ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించారు యువ న‌టి సిమ్రాన్ చౌద‌రి. అందులో భాగంగా సోమ‌వారం కోంపల్లిలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె తన మిత్రులు వేదలహేమచంద్ర, శ్రేయ రావు, నితీష, మనతు సింగ్‌లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాల‌ని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార‌క్ర‌మాన్ని ప్రారంభించిన పార్లమెంట్ మెంబ‌ర్ సంతోష్‌కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement