Abn logo
May 15 2020 @ 14:42PM

రాజ్‌త‌రుణ్ త‌ల్లిపాత్ర‌లో సిమ్రాన్‌..!

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. అందులో ఒక‌టి బాలీవుడ్ చిత్రం ‘డ్రీమ్‌గ‌ర్ల్’ తెలుగు రీమేక్‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సంతోష్ మోహ‌న్ వీరంకి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ‘డ్రీమ్ గ‌ర్ల్’ రీమేక్‌లో న‌టించ‌బోతున్న‌ట్లు రాజ్‌త‌రుణ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. కాగా లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ త‌ల్లి పాత్ర‌లో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటించ‌బోతున్నార‌ట‌. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించి అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. 

Advertisement
Advertisement
Advertisement