Abn logo
Jun 3 2020 @ 14:36PM

`చంద్రముఖి-2`.. సిమ్రాన్ క్లారిటీ!

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం `చంద్రముఖి`. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి త్వరలో సీక్వెల్ తెరకెక్కబోతోంది. పి.వాసు దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ నటించబోతున్నాడు. 


ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్రలో నటించబోతోందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా సిమ్రాన్ స్పందించింది. తను `చంద్రముఖి-2`లో నటించడం లేదని స్పష్టం చేసింది. `అభిమానులను నిరాశకు గురి చేస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను `చంద్రముఖి-2`లో నటించడం లేదు. ఆ సినిమాలో నటించమని నన్ను ఇప్పటివరకు ఎవరూ అడగలేదు. దయచేసి అవాస్తవ వార్తలను ప్రచారం చేయకండ`ని సిమ్రాన్ విజ్ఞప్తి చేసింది. 

Advertisement
Advertisement
Advertisement