Abn logo
Sep 22 2020 @ 00:24AM

సాదాసీదాగా నస్పూర్‌ మున్సిపల్‌ సమావేశం

నస్పూర్‌. సెప్టెంబరు 21 : నస్పూర్‌ మున్సిపాలిటీ సమావేశం సోమవారం సాదాసీదాగా జరిగింది.  చైర్మ న్‌ ఈసంపల్లి ప్రభాకర్‌ అధ్యక్షతన స్థానిక నర్సయ్య భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. 37 అంశాలపై చర్చించి కౌన్సిల్‌ ఆమోద ముద్రవేసింది. మున్సిపాలిటీ కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు, రెండు కంప్యూ టర్లు, ప్రింటర్లు, స్కానర్ల కొనుగోలు, బోర్ల మరమ్మతు, ట్రీగార్డు, సోడియం హైపోక్లోరైడ్‌ కొనుగోలుకు, రెండు వాటర్‌ ట్యాంకర్లు, పారిశుధ్య చెత్త తరలింపునకు రెం డు ట్రాక్టర్లు, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలుకు సమావేశం లో ఆమోదం లభిం చింది. పలు బిల్లులపై కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చేయని పనులకు తప్పుడు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం చేసుకుని నిధులను దుర్వినియో గం చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. పట్టణ అభి వృద్ధికి తమ కౌన్సిల్‌ కృషి చేస్తోందని, ప్రతిపక్షాలు అన వసరమైనా రాద్దాంతం చేయడం సరికాదని చైర్మన్‌ పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దివాకర్‌రావు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


ఎజెండాలో ప్రజా సమస్యలు లేవు

మున్సిపాలిటీ సమావేశం ఎజెండాలో ప్రజా సమస్య లను ప్రస్తావించ కపోవడం విడ్డూరంగా ఉందని సీపీఐ కౌన్సిలర్లు రేగుంట చంద్రశేఖర్‌, మేకల దాసులు ఆరో పించారు. సమావేశం ముగిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సమావేశానికి అన్ని శాఖల అధికారులు రావాల్సి ఉండగా ఏ శాఖ అధికారి రాలేద న్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాలో పొందుపర్చలేదన్నారు. చాలా చోట్ల రహదా రులు, మరుగుదొడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 


బిల్లుల ఆమోదం కొరకే సమావేశం 

ప్రజల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయాల్సి న సమావేశం కేవలం బిల్లుల ఆమోదం కోసం  ఏర్పా టు చేశారని కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ళ వేణు, బీజేపీ సభ్యులు అగల్‌డ్యూటీ రాజు, సత్యనారాయణలు ఆరోపించారు. సమావేశం ముగిసిన అనంతరం విలేక రులతో మాట్లాడుతూ ప్రసుత్తం పట్టణంలోని సమస్య లపై దృష్టి సారించడకుండా బిల్లుల ఆమోదం చేసుకొ ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన వార్డుల్లో మాత్రమే పనులు కేటాయిం చి బిల్లులు పంచుకున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement