సాదాసీదాగా స్వాతంత్య్ర దిన వేడుకలు

ABN , First Publish Date - 2020-08-15T10:29:44+05:30 IST

కొవిడ్‌ కారణంగా చిత్తూరులో శనివారం 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను సాదాసీదాగా నిర్వహించనున్నారు. 60 నిమిషాల్లోపు ముగించాలన్న ప్రభు

సాదాసీదాగా స్వాతంత్య్ర దిన వేడుకలు

  60 నిమిషాల్లోపే ముగింపు

 డిప్యూటీ సీఎం చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కణ 

 కరోనా వారియర్స్‌, ప్లాస్మా దాతలకు సనానం 

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 14: కొవిడ్‌ కారణంగా చిత్తూరులో శనివారం 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను సాదాసీదాగా నిర్వహించనున్నారు. 60 నిమిషాల్లోపు ముగించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు పరేడ్‌ మైదానంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈసారి వందలాది మంది పోలీసులు, ఏఆర్‌ సిబ్బంది విన్యాసాలు, శకటాల ప్రదర్శన, వందలాది విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, వీరికి బహుమతులు, వెయ్యి మందికిపైగా ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు..


ఇలాంటి ఆర్భాటాలేవీ కన్పించవు. కేవలం రెండు పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల స్టాళ్లను రెండుకే పరిమితం చేశారు. గతంలో 500మంది ప్రముఖులకున్న ఆహ్వానాన్ని 50కే పరిమితం చేశారు. లబ్ధిదారుల ఆస్తుల పంపిణీని రద్దు చేయడం చేశారు. ఇక కరోనాను జయించిన పది మంది సీనియర్‌ సిటిజన్లు, ఐదుగురు ప్లాస్మాదాతలకు సన్మానం చేస్తున్నారు.


ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. తొలుత జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పతాకావిష్కరణ చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, అనివార్య కారణాలతో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం హాజరు కానున్నట్లు చెప్పారు. 


చిత్తూరు సెంట్రల్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పేరెంట్స్‌ కమిటీల సమక్షంలో స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించాలని డీఈవో నరసింహారెడ్డి ఆదేశించారు. సాంస్కృతిక ప్రదర్శనలిచ్చే విద్యార్థులతో శుక్రవారం జరిగిన రిహార్సల్స్‌ను పర్యవేక్షించారు. 

Updated Date - 2020-08-15T10:29:44+05:30 IST