సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం

ABN , First Publish Date - 2021-12-29T22:58:17+05:30 IST

సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం జరిగింది. సింహాద్రి అప్పన్న భక్తులు మాల విసర్జన కార్యక్రమంలో..

సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం

విశాఖ: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో అపచారం జరిగింది. సింహాద్రి అప్పన్న ఆలయంలో మాలల విసర్జన కార్యక్రమంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈవో సూర్య కళ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా సింహాద్రి అప్పన్న భక్తులు చందన మాల ధరించి నలభై ఒక్క రోజులు దీక్షలు చేపట్టి, మాలలు విసర్జన చేసేటప్పుడు సింహాద్రి అప్పన్న దర్శనం అనంతరం మాలల విసర్జన చేస్తారు. కానీ ఈవో సూర్య కళ నిర్ణయంతో ఈ సంవత్సరం దేవస్థానం అధికారులు సింహాచలం తొలి పావంచ వద్ద ఏర్పాటు చేయడంతో భక్తులకు ఒకేసారి అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఈవో సూర్యకళ తీరుపై సింహాద్రి అప్పన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-12-29T22:58:17+05:30 IST