వివాదాలకు అడ్డగా సింహాద్రి అప్పన్న దేవస్థానం.. ఎందుకిలా జరుగుతోంది?

ABN , First Publish Date - 2020-09-05T16:27:15+05:30 IST

విశాఖ సింహాచలం సింహాద్రి అప్నన్న దేవాలయం ఈ మధ్యకాలంలో నిరంతరం ఎందుకు వివాదాలకు తావునిస్తుంది? ఆధిపత్యపోరు మధ్య ఆధికారులు నలిగిపోతున్నారా?

వివాదాలకు అడ్డగా సింహాద్రి అప్పన్న దేవస్థానం.. ఎందుకిలా జరుగుతోంది?

విశాఖ సింహాచలం సింహాద్రి అప్నన్న దేవాలయం ఈ మధ్యకాలంలో నిరంతరం ఎందుకు వివాదాలకు తావునిస్తుంది? ఆధిపత్యపోరు మధ్య ఆధికారులు నలిగిపోతున్నారా? వరుసగా అధికారులు బదిలీలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం...


విశాఖపట్నం: విశాఖ సింహాచలం దేవస్థానం ఈ మధ్యకాలంలో  నిరంతరం వివాదాలకు నెలవుగా మారుతుంది. గతంలో దేవాలయం విషయంలో పెద్దగా వివాదాలు లేనప్పటికి ఈ మధ్యకాలం ప్రతిది వివాదంగానే మారుతుంది. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తలుగా ఉన్న ఆశోక్ గజపతిరాజును తొలగించి, ఆ స్థానంలో సంచయిత గజపతిని నియమించడం.. ఆమె ఒక్కరే వెళ్లి నేరుగా ప్రమాణ స్వీకారం చేసేయడం.. నియామకం కూడ అయిపోయింది. అందుకు సంబంధించిన జీవోను సైతం ప్రభుత్వం బయటకు కనిపించకుండా పెట్టింది. అయితే ఆమె భాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెద్దు పోకడలతోనే వెళ్తున్నారు. దేవాలయంలో ఏ నిర్ణయం తీసుకున్న తనకు తెలియాలని, తనకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదని, ఆమె చేతికి పగ్గాలు రాగానే ఈవోతో సహా అందరికి సుతిమెత్తగానే సంచయిత చెప్పిందట. ఇప్పటికి ఆమె ఆదే పంథాను కోనసాగిస్తున్నారు.


అయితే, సింహాచలం దేవస్థానం భీమిలీ నియోజకవర్గంలో ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆవంతి శ్రీనివాసరావు కూడ నిరంతరం ఆలయం మీద పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏం చేసినా నాకు తెలియకుండా జరగకూడదు. ఎందుకంటే, నేను ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. స్థానికంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అందుకోసం నాకు తెలియకుండా ఏం జరగకూడదని, అధికారులను పిలిచి పలుమార్లు ఆవంతి చెప్పారట. అయితే అటు చైర్ పర్సన్, ఇటు మంత్రి మధ్య నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. 


నా మనిషి.. వెళ్లేది లేదు...

గతంలో ఆక్రమ గ్రావెల్, భూ ఆక్రమణలు జరిగాయంటూ, పలువురు పిర్యాదు చేయడంతో ఏండోమెంట్ ఆధికారి ఆజాద్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి,  ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. అందుకు భాధ్యున్ని చేస్తూ, ఈవో వెంకటేశ్వరరావును మాతృశాఖకు బదిలి చేశారు. ఆ స్థానంలో ఈవోగా భ్రమరాంబను నియమించడం జరిగింది. ఆమె కొద్దిగా ముక్కుసూటిగా పోయే మనిషి, ఇప్పుడు అదే ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. సంచయిత గజపతి పర్సనల్ సెక్రటరీ ఒకరు సింహచలం కోండపైన గెస్ట్ హౌస్‌లో ఉంటున్నారు. అతనికి అన్ని వసతులు దేవస్థానం నుండి అందిస్తున్నారు. ఒక కారును కూడా ఇచ్చారట. అయితే గెస్ట్ హౌస్‌ను వెంటనే కాళీ చేయాలని ఈవో భ్రమరాంబ నోటిసులు ఇచ్చారట. దీనిపై తీవ్రంగా స్పందించిన సంచయిత ‘అతను నా మనిషి మీరు ఏలా చెప్తారు.. అతను వెళ్లడం కూదరదు’ అని చెప్పి అక్కడే ఉంచారట. 


ఈవోను మార్చాల్సిందే..

అలాగే  కోవిడ్ సమయంలో ఆదాయం లేక సిబ్బంది తోలగింపు విషయంలో, జీతాలు తగ్గించి ఉంచుదామని ఈవో సలహా ఇస్తే, వారిని తోలగించాల్సిందేనని చెప్పారట. దీంతో గోశాల సిబ్బందితో కలిపి 200 మందికి పైగా తీసేశారు. దీనిపైనా పెద్ద దూమారం రేగింది. మళ్లీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. వారిని వెంటనే నియమించాలని ఎండోమెంట్ మినిస్ట్రర్ చెప్పడంతో ఆమె నియమించారు. అయితే వారికి జీతాలు ఇవ్వాలంటే ట్రస్ట్ పరిధిలోని ఏదో ఒక సంస్థకు కేటాయించాలి. అందుకు చైర్మన్ అనుమతి కావాలి. దీంతో జీతాలు విషయంలో చైర్మన్ సహాకరించలేదు. ఇదే ఆంశంపై  మంత్రి పిలిచి, మీరు వారిని ఏలా తొలగిస్తారంటూ ఈవో పై ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్ర్రంలో ఉన్న ఆలయాల చైర్మన్లతో జరిగిన వీడియో కాన్షరెన్స్‌లో సంచయితే స్వయంగా ఇక్కడకు పర్మినెంట్ ఈవోను నియమించాలని, ప్రస్తుతం ఉన్న ఈవోను మార్చులంటూ మంత్రిని కోరారట. 


మంత్రి తమ్ముడు కావడంతో ఏం చేయలేక...

ఇదిలాఉంటే.. మంత్రి తమ్ముడుకి చెందిన ఇంటర్నేషనల్ స్కూల్ విషయంలో చైర్మన్ వివరణ ఆడిగితే, అందుకు బాధ్యులను చేస్తూ ఎస్ఈని ఆమె సస్పెండ్ చేసింది. స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరారట. అయితే అది స్వయనా మంత్రి తమ్ముడిది కావడంతో ఆమె ఎమీ చేయలేకపోయారట. ఈ మధ్యనే జరిగిన బోర్డు మీటింగ్ సమావేశంలో కూడ పది ఆంశాలను చర్చకు పెడితే తోమ్మిదింటిని పక్కన పెట్టి, ఓఎస్డీని నియామకంపై సభ్యులంతా తీర్మానించారు. అంతేకాదు.. ఈ విషయాల పట్ల తమకు ఆవగాహాన లేదని, మరికొంత సమయం కావాలని కోరారట. ఈ ఆంశంపైన సంచయిత ఈవో మీద ఆగ్రహం వ్యక్తం చేశారనేది సమాచారం. సిబ్బంది పునః నియామకం విషయంలో మంత్రి చొరవ తీసుకోవడంతో మళ్లీ సగం జీతం ఉద్యోగులకు ఇచ్చేందుకు ఆంగికరించి విధుల్లోకి తీసుకున్నారు. ఈ విషయంలోనూ ఈవోపై సంచయిత ఆగ్రహం వ్యక్తం చేశారట.


కాగా, గతంలో ఉన్న ఈవో బదిలికి అధికారపార్టీ నేతల సిఫారసులే కారణం అని తెలుస్తోంది. ఇటు మంత్రి, అటు చైర్మన్ మధ్య నలిగి బలవడం కంటే, వెళ్లిపోవడమే మంచిదని భావించిన ఈవో భ్రమరాంబ.. తాను ఇక్కడ చేయలేనని, రాజమండ్రి యథాస్థానానికి వెళ్లిపోతానని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారట. దీంతో ప్రభుత్వం ఆమెను అక్కడకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో అన్నవరం ఈవో త్రినాథ్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆయన భాధ్యతలు చేపట్టిన రోజే  సింహాచలం దేవస్థానం బంగారం అమ్ముతామంటూ 1.40 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన కేసు వెలుగు చూసింది. మరోవైపు ఇప్పుడు భూ ఆక్రమణల కేసులో మరికొంతమంది సిబ్బంది ప్రమేయం ఉందని వారి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఫేస్ చేస్తూ ఇటు చైర్మన్‌ను, అటు మంత్రిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి.

Updated Date - 2020-09-05T16:27:15+05:30 IST