సింహ వాహనంపై కామాక్షితాయి

ABN , First Publish Date - 2022-05-26T05:59:17+05:30 IST

మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్లు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

సింహ వాహనంపై కామాక్షితాయి
గ్రామోత్సవంలో సింహవాహనంపై కామాక్షితాయి

బుచ్చిరెడ్డిపాళెం, మే25: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్లు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి జొన్నవాడకు చెందిన కందికట్టు సుబ్బారావు, శివకుమార్‌, వెంకటరమణయ్య, దివంగత కామేశ్వరరావు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉదయం జరిగిన తిరుచ్చి ఉత్సవానికి జొన్నవాడకు చెందిన దివంగత శ్రీశైలం రామమూర్తి కుమారులు శ్రీధర్‌, శివకుమార్‌లు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, ఈవో డీ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. కాగా గురువారం రాత్రి హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. కాగా  కామాక్షితాయికి బుధవారం  మండలంలోని పెనుబల్లికి చెందిన చెన్నారెడ్డి నిరంజన్‌రెడ్డి, సౌందర్యమ్మ దంపతుల కుమారుడు సుమకర్‌రెడ్డి 8 గ్రాముల 180 మిల్లీ గ్రాముల   బరువున్న 20 వజ్రాలు, ఒక కెంపుతో కూడిన డాలర్‌ ముత్యాల దండను బహూకరించారు. అలాగే శ్రీశైలం శ్రీధర్‌, కుటుంబ సభ్యులు  ఓ వీల్‌ చైర్‌ను బహూకరించారు.


అమ్మవారి సేవలో ప్రముఖులు

 కామాక్షితాయి అమ్మవారిని బుధవారం హైకోర్టు జడ్జి వడ్డిబోయిన సుజాతమ్మ, డీఎంహెచ్‌వో మల్లి పెంచలయ్యలు దర్శించుకున్నారు. అలాగే ఆలయానికి చెందిన గోశాల దాతలు బండి వేణుగోపాల్‌రెడ్డి, హరిత దంపతులు కూడా దర్శించుకున్నారు .

Updated Date - 2022-05-26T05:59:17+05:30 IST