Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 21 Nov 2021 19:52:02 IST

నన్ను నేను మార్చుకున్నా: శింబు

twitter-iconwatsapp-iconfb-icon

‘మన్మథ’ సినిమాతో టాలీవుడ్‌ని ఆకర్షించాడు శింబు. ఆ తర్వాత విడుదలైన ఏ చిత్రం ‘మన్మథ’ స్థాయిని అందుకోలేకపోయింది. అయితే ‘లూప్‌’ చిత్రం మరచిపోలేని విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని శింబు అంటున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శింబు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. 


ఇదొక పొలిటికల్‌ థ్రిల్లర్‌. సైన్స్‌ ఫిక్షన్‌ని మేళవించి తెరకెక్కించాం. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం సామాన్యుల్ని ఎలా వాడుకుంటున్నారో ఈ కథలో చెప్పాం. దానికి టైమ్‌ లూప్‌ అనే కాన్సెప్ట్‌ జోడించాం. ఓ యువకుడి జీవితంలో ఓ ఘటన మళ్లీ మళ్లీ ఎదురవుతుంటుంది. అలా ఎందుకు జరుగుతోంది? ఆ యువకుడు ఆడిన రాజకీయ చదరంగం ఎలాంటిది?  అనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎవరి జీవితంలోనూ ఇలా జరిగి ఉండకపోవొచ్చు. ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్‌ అవుతుంది. 


దక్షిణాదిన ఈ తరహా కథలతో తక్కువ సినిమాలొచ్చాయి. కాబట్టి.. ఈ కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించింది. వెంకట్‌ ప్రభు అందరికీ అర్థమయ్యే రీతిలో తెరకెక్కించారు. ఎస్‌.జె.సూర్య పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించారు. మా ఇద్దరి మధ్య టామ్‌ అండ్‌ జెర్రీలాంటి పోటీ జరుగుతుంటుంది. కథానాయికగా కల్యాణి ప్రియదర్శిని పాత్ర చాలా కీలకం. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాబట్టి.. రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. మఽధ్యలో సినిమా ఆగిపోయింది. ఈ సినిమా పూర్తిచేయడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టిందంటే.. ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఆ కష్టాలన్నీ గుర్తుకురావడం వల్లే... ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కన్నీళ్లొచ్చాయి. ఈ సినిమాకి ముందు నా కెరీర్‌ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. నన్ను నేను మార్చుకోవాలని 27 కిలోలు తగ్గాను. ఆహార అలవాట్లు  మార్చుకున్నా. మద్యపానానికి, మాంసాహారానికి దూరమాయ్యా. ఇకపై నా ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తా. మంచి కథ కుదిరితే తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేయాలనుకుంటున్నా. ది లూప్‌’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్‌గారికి, బన్నీ వా్‌సుకు కృతజ్ఞతలు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement