తమలపాకు అలంకారంలో ఆంజనేయస్వామి
ఇందుకూరుపేట, జనవరి 16 : పల్లెపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెండి తమలపాకుల మాలను భక్తు లు సమర్పించారు. ఆదివారం కరీంనగర్ వాస్తవ్యులు గురజాల చెంచ య్య, అన్నపూర్ణమ్మ దంపతులు స్వయంగా స్వామిని దర్శించుకుని ఆలయ నిర్వాహకులకు వెండి మాలను అందించారు. అనంతరం స్వామికి అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.