ఆంజనేయస్వామి ఆలయ అర్చకులకు వెండి గధను బహూకరిస్తున్న దాతలు
రాపూరు, మే 22 : పెంచల నృసింహుడి క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి వెండి గధ అలంకారమైంది. గూడూరుకు చెందిన గొట్టిపోలు రామసుబ్బారెడ్డి సతీమణి రాణి ఒకటిన్నర కిలోల వెండి గధను తయారు చేయించి ఆదివారం ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు మఽధూ స్వామికి అందించారు. దాతలు గధతో గిరిప్రదక్షిణలు చేసి అర్చకస్వామికి అందించగా పూజలు చేసి స్వామి వారికి అలంకరించారు.