Abn logo
Sep 22 2021 @ 03:57AM

హుసాముద్దీన్‌కు రజతం

బళ్లారి: జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో డిఫెండింగ్‌ చాంప్‌ హుసాముద్దీన్‌కు షాక్‌ తగిలింది. మంగళవారం జరిగిన 57 కిలోల విభాగం ఫైనల్‌ బౌట్‌లో తెలంగాణకు చెందిన సర్వీసెస్‌ బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ 0-5తో ఢిల్లీ బాక్సర్‌ రోహిత్‌ మోర్‌ చేతిలో పరాజయం పాలై రజతంతో సంతృప్తి పడ్డాడు. కాగా, ఆసియాడ్‌ పతక విజేత శివ థాపా (63.5 కి)తోపాటు దీపక్‌ కుమార్‌ (51 కిలోలు), ఆకాష్‌ (54 కి), సుమిత్‌ (75 కి), సచిన్‌ కుమార్‌ (80 కి), లక్ష్య (86 కి), నరేంద్ర (+92 కి) స్వర్ణాలు సాధించారు.