మాస్క్ ధరించని వారికి పోలీసుల వింత శిక్ష

ABN , First Publish Date - 2020-07-11T11:44:39+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత సమయంలో ఎవరైనా ముఖానికి మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే...వారికి ట్రాఫిక్ పోలీసులు వింత శిక్ష విధిస్తున్న ఉదంతం....

మాస్క్ ధరించని వారికి పోలీసుల వింత శిక్ష

సిలిగురి (పశ్చిమబెంగాల్): కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత సమయంలో ఎవరైనా ముఖానికి మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే...వారికి ట్రాఫిక్ పోలీసులు వింత శిక్ష విధిస్తున్న ఉదంతం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో వెలుగుచూసింది. రోడ్లపై మాస్క్ ధరించని వారికి మృదువైన శిక్ష విధించాలని సిలిగురి మెట్రోపాలిటన్ పోలీసులను జిల్లా వైద్యఆరోగ్యశాఖ సూచించింది. రోడ్లపై మాస్క్ ధరించకుండా తిరిగే వారికి రెండు గంటలపాటు అక్కడే కూర్చొబెట్టి ‘నిరీక్షణ శిక్ష’ విధించాలని పశ్చిమబెంగాల్ ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత కుమార్ రాయ్ పోలీసులను కోరారు. దీంతో సిలిగురి పోలీసులు రోడ్లపై మాస్క్ ధరించకుండా వచ్చిన వారిని రోడ్డుపై రెండు గంటలపాటు కూర్చోబెట్టి ‘నిరీక్షణ శిక్ష’ విధిస్తున్నారు. సిలిగురిలో కరోనా వైరస్ కేసులు పెరిగిన నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ లోని 9 మున్సిపల్ వార్డులు, డార్జిలింగ్, జల్ పాయ్ గురి జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించారు. 

Updated Date - 2020-07-11T11:44:39+05:30 IST