కేడీపల్లిలో అనధికారిక ఇసుక నిల్వలు

ABN , First Publish Date - 2021-05-14T04:14:53+05:30 IST

మండలంలోని కచ్చేరిదేవరాయపల్లిలో అనధికారిక ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించే ందుకు నిల్వ చేసినట్లు స్థానికులు

కేడీపల్లిలో అనధికారిక ఇసుక నిల్వలు
గ్రామంలో నిల్వ చేసిన ఇసుక

 గుట్టుచప్పుడుగా అక్రమరవాణా

అనంతసాగరం, మే 13: మండలంలోని కచ్చేరిదేవరాయపల్లిలో అనధికారిక ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించే ందుకు నిల్వ చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్‌ అధికారుల అనుమతులు లేకుండా ఇసుకను డంప్‌ చేయరాదు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను నిల్వ చేసిన వైనం అనుమానాలకు తావిస్తుంది. పెన్నాలో ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు జరిపి గ్రామంలో ఇసుక నిల్వ చేసి  అదును చూసి రాత్రి పూట అక్రమరవాణా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని విమర్శిస్తున్నారు.

Updated Date - 2021-05-14T04:14:53+05:30 IST