అద్దంలో మౌనం

ABN , First Publish Date - 2022-05-30T06:01:43+05:30 IST

అక్షరాలన్నీ అద్దంలో అంతరంగ తరంగ నిశ్శబ్దాలే తిమిర నయనాలకు వీక్షించలేని గంతలు నిష్ఫలమే...

అద్దంలో మౌనం

అక్షరాలన్నీ అద్దంలో 

అంతరంగ తరంగ నిశ్శబ్దాలే 

తిమిర నయనాలకు 

వీక్షించలేని గంతలు నిష్ఫలమే


సృజన గొంతు దిగింది

తడి తడి పదాల్లో మెత్తగా

మనసు అల్లిక కొత్తకొత్తగుంది

మౌనం మాట్లాడింది విస్ఫోటనమై


అక్షరాల కలలన్నీ 

పోసిన ప్రాణంలో కవితా చిత్రాలే

వాహకాలైన ఆలోచనల చలనాలే

సంచలనాల వేదికైన చోదక శక్తులే


ప్రతిదీ ప్రకృతిలో నిశ్శబ్దంకాని

ఓ ఉత్ర్పేరకమే

అక్షరాలను ప్రోదిచేసే పాదాల్లో

వాక్యాలను రాసింది పొత్తిళ్ళే

తొణకనీ బెణకనీ ప్రసవ వేదనే

ప్రాణం పోసింది చీకటిలో వెల్లువై


తల్లి ఒడిని తడిపిన రుధిరం  

మెరుపుల అరుపులు రువ్వి

మౌనం తొవ్వింది అద్దంలో

అనంత అర్థాలను చదివిన

అనేకానేక పదకోశాల విరి వృక్షమై


కలల కన్నులను 

చెరిపేసే పైశాచిక చూపులు

ఊపిరి ఆశలను కాలరాస్తే

కలలు రగిలే గాయాలై


కష్టాలూ కన్నీళ్లన్నీ బాధలన్నీ

అనుభవాల క్లేశాలే ఇలలో

రాగద్వేషాలు లేని భావోద్వేగాలకూ

కాలంలో నిలబడే గట్టి గింజకే

ఆత్మ దొరుకుతుంది ఆలోచిస్తే... 


ఎదుటివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో

మంచిని పెంచే గుణముంది మిత్రమా

మానవత్వం నింపేదే బతుకు

మంచిని వినిపించేదే చెలిమి తోట

టి. రాధాకృష్ణమాచార్యులు

98493 05871


Updated Date - 2022-05-30T06:01:43+05:30 IST