Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 11 Dec 2021 18:25:54 IST

SIMBU : ఆసుపత్రిలో తమిళ స్టార్ హీరో...

twitter-iconwatsapp-iconfb-icon
SIMBU : ఆసుపత్రిలో తమిళ స్టార్ హీరో...

తమిళ స్టార్ హీరో శింబు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఆయన వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శింబు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉన్నాడు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో అతడ్ని డాక్టర్ల పర్యవేక్షణ కోసం తరలించారట. అయితే, శింబుకు కోవిడ్ 19 మాత్రం సోకలేదని దగ్గరి వారు క్లారిటీ ఇస్తున్నారు...


వైరల్ ఇన్‌ఫెక్షన్‌కి ముందు శింబు ‘వెంతు తణిన్‌దదు కాడు’ అనే సినిమా రెగ్యులర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అయితే, తమ హీరో హాస్పిటల్‌లో అడ్మిట్ కావాల్సి రావటంతో దర్శకుడు గౌతమ్ మీనన్ షూట్‌ని ఆపేసినట్టు తెలుస్తోంది. మళ్లీ శింబు సెట్స్ మీదకి వచ్చాక చిత్రీకరణ మొదలవ్వనుంది. ‘మానాడు’ సినిమాతో శింబు ఈ మధ్య మంచి హిట్ కొట్టాడు. ప్రేక్షకులు, విమర్శకులు ముక్త కంఠంతో అతడ్ని మెచ్చుకున్నారు. గౌతమ్ మీనన్ సినిమా ‘వెంతు తణిన్‌దదు కాడు’ కూడా ఇప్పటికే చాలా క్రేజ్ సంపాదించుకుంది. శింబు ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నరు. ప్రస్తుతం టాలెంటెడ్ యాక్టర్ వైరల్ ఫీవర్ బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు...   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International