Abn logo
Aug 2 2021 @ 01:16AM

సహజ ప్రకృతి సాగుపై శిక్షణ తరగతులు నేడు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, తారామతిపేటలో ప్రతి శనివారం సహజ ప్రకృతి సాగుపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ అధినేత వై.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. 31 ఏళ్లుగా సహజ సిద్ధంగా పంటలు పండిస్తూ శ్రీవరి సాగులో ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి సొంతం చేసుకుంటున్న గుడివాడ వెంకటరత్నంనాయుడు ప్రకృతి నిలయంలో సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు 2న జరిగే శిక్షణ తరగతులకు నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌రావు, రాష్ట్ర పశువైద్య సంచాలకులు లక్ష్మారెడ్డి హాజరవుతున్నారని చెప్పారు. 

హైదరాబాద్మరిన్ని...