టీ ఎం-సెట్‌లో సిక్కోలు సత్తా

ABN , First Publish Date - 2022-08-13T04:56:31+05:30 IST

తెలంగాణ ఎం-సెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 4, 5, 19, 965 ర్యాంకులు సాధించారు. శుక్రవారం ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన పల్లి జలజాక్షి ఇంజినీరింగ్‌ విభాగంలో నాలుగో ర్యాంకుతో సత్తా చాటింది.

టీ ఎం-సెట్‌లో సిక్కోలు సత్తా

- రాష్ట్రస్థాయిలో 4, 5, 19 ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ సంతబొమ్మాళి, ఆగస్టు 12)

తెలంగాణ ఎం-సెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో 4, 5, 19, 965 ర్యాంకులు సాధించారు. శుక్రవారం ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన పల్లి జలజాక్షి ఇంజినీరింగ్‌ విభాగంలో నాలుగో ర్యాంకుతో సత్తా చాటింది. ఏపీ ఎం-సెట్‌లో కూడా జలజాక్షి 30వ ర్యాంక్‌ వచ్చింది. ఇటీవల జేఈఈ మెయిన్స్‌లో ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంక్‌, ఓబీసీ విభాగంలో 2వ ర్యాంక్‌ సాధించింది. జలజాక్షి తండ్రి గోవిందరాఉ ఉపాధ్యాయుడు. తల్లి విజయలక్ష్మీ గృహిణి. జలజాక్షి 1 నుంచి ఏడో తరగతి వరకు అనంతపురంలో, 8 నుంచి ఇంటర్‌ వరకు విజయవాడలో ప్రైవేటు కళాశాలలో చదువుకుంది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పల్లి జలజాక్షి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ముంబై ఐఐటీలో సీటు సాధించి.. కంప్యూటర్‌ ఇంజినీర్‌ కావడమే నా జీవితాశయం. ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదివాను. రసాయన శాస్త్రం సబ్జెక్టుకు సంబంధించిన సందేశాలను ఎప్పటికప్పుడు లెక్చరర్స్‌ వద్ద నివృత్తి చేసుకున్నాను. ప్రతి సబ్జెక్టుకు నోట్స్‌ పకడ్బందీగా రాసుకోవడంతో.. విజయానికి దోహదపడింది’ అని తెలిపింది.  
- శ్రీకాకుళం నగరం షిరిడీసాయి కాలనీకి చెందిన మెండ హిమవంశీ తెలంగాణ ఎం-సెట్‌లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. ఇటీవల  జేఈఈలో ఆల్‌ఇండియా 7వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు రవిశంకర్‌, స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. హిమవంశీ విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేశాడు.
- శ్రీకాకుళం మండలం భైరి గ్రామానికి చెందిన భైరి సిద్ధార్థరాయ్‌ తెలంగాణ ఎంసెట్‌లో 19వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇటీవల జేఈఈ మెయిన్స్‌లో 309 ర్యాంకు సాధించారు. ఉత్తమ ర్యాంకు వచ్చినందుకు తల్లిదండ్రులు సత్యజిత్‌రాయ్‌, నీరజాలక్ష్మిలు హర్షం వ్యక్తం చేశారు.
- మునసబుపేటలో ప్రైవేటు జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థి కొర్ను సాయిప్రదీప్‌నాయుడు 965 ర్యాంకు సాధించాడు.

 

Updated Date - 2022-08-13T04:56:31+05:30 IST