పర్యాటకులను ఆకర్షించేందుకు కోవిడ్ ఆంక్షల సడలింపు!

ABN , First Publish Date - 2021-08-16T12:39:47+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న నేపధ్యంలో...

పర్యాటకులను ఆకర్షించేందుకు కోవిడ్ ఆంక్షల సడలింపు!

గ్యాంగ్‌టాక్: కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు కోవిడ్-19 ఆంక్షలను మెల్లమెల్లగా సడలిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు తెరవాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా సిక్కిం ప్రభుత్వం కోవిడ్-19 ఆంక్షలను సడలించింది. కనీసం ఒక డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులకు రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతించింది. 


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాప్టంలోని దుకాణాలు, వాణిజ్య సముదాయాలను రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటివరకూ సాయంత్రం 5 గంటల వరకూ దుకాణాలు తెరిచేందుకు అనుమతులున్నాయి. రవాణా సాధానాలపై కూడా ఇంతవరకూ ఇటువంటి ఆంక్షలే కొనసాగాయి. అయితే ఇప్పుడు వీటికి కూడా ఆంక్షలు సడలించారు. టీకా వేయించుకోని వారు రాష్ట్రంలోకి రావాలంటే 72 గంటల వ్యవధిలోపు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు సంబంధిత అధికారులకు చూపించాల్సివుంటుంది.

Updated Date - 2021-08-16T12:39:47+05:30 IST