2023 నాటికి సిక్కింకు రైలు కనెక్టివిటీ

ABN , First Publish Date - 2021-11-15T16:44:58+05:30 IST

2023 సంవత్సరం నాటికి సిక్కింకు కొత్తగా రైలు కనెక్టివిటీ కల్పిస్తామని నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా వెల్లడించారు...

2023 నాటికి సిక్కింకు రైలు కనెక్టివిటీ

డార్టిలింగ్ : 2023 సంవత్సరం నాటికి సిక్కింకు కొత్తగా రైలు కనెక్టివిటీ కల్పిస్తామని నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా వెల్లడించారు.సేవోక్- రాంగ్‌పో కొత్త రైలు మార్గం 2023 కల్లా పూర్తి చేస్తామని జీఎం పేర్కొన్నారు. 2009వ సంవత్సరంలో అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి 20 కి.మీ దూరంలో ఉన్న సెవోక్ వద్ద ప్రాజెక్ట్ సైట్‌ను సందర్శించిన తర్వాత నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కొండలు, గుట్టలతో కూడిన కష్టమైన భూభాగం కావడంతో రైలుమార్టం నిర్మాణం కష్టతరంగా మారిందని చెప్పారు.


ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే బోర్డు డిసెంబర్ 2023 నాటికి ఈ రైలు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ - సిక్కింలను కలిపే ఈ రైల్వేలైను నిర్మాణం కోసం రూ.1,339.48 కోట్లు కావాలని అంచనా వేశారు. కానీ నిర్మాణంలో జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం రూ.5,000 కోట్లకు పైగా పెరిగింది.41.54 కి.మీ రైల్వే లైన్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్,కాలింపాంగ్ జిల్లాల్లో ఉండగా, మిగిలిన 3.44 కి.మీ భాగం సిక్కిం మీదుగా నడుస్తుంది.ప్రాజెక్ట్‌లో 14 సొరంగాలు, 17 వంతెనలు,ఐదు స్టేషన్‌లు ఉన్నాయి, వీటిలో కాలింపాంగ్ జిల్లాలోని తీస్తా వద్ద భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. 


Updated Date - 2021-11-15T16:44:58+05:30 IST