Kabul Attack : పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ సురక్షితం

ABN , First Publish Date - 2022-06-18T22:47:31+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో గురుద్వారా కర్టే పర్వాన్‌పై ఉగ్రవాద

Kabul Attack : పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ సురక్షితం

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో గురుద్వారా కర్టే పర్వాన్‌పై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో సిక్కుల పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఉగ్రవాద దాడుల్లో అగ్ని జ్వాలల్లో చిక్కుకున్న ఈ గురుద్వారాలోకి సాహసోపేతులైన సిక్కులు ప్రవేశించి, తమ పవిత్ర గ్రంథాన్ని కాపాడుకున్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) రాజధాని నగరం కాబూల్‌ (Kabul)లో గురుద్వారా కర్టే పర్వాన్ శనివారం పేలుళ్ళతో దద్దరిల్లింది. మొత్తం ప్రాంగణం అగ్ని జ్వాలల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, తాలిబన్ సైనికులు ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడుల వెనుక ఐసిస్ ఖొరసాన్ (ISIS Khorasan) ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. 


ఈ నేపథ్యంలో మంటల్లో చిక్కుకున్న గురుద్వారాలోకి కొందరు సిక్కులు సాహసోపేతంగా ప్రవేశించి, తమ పవిత్ర గ్రంథాన్ని సురక్షితంగా గురుద్వారా కర్టె పర్వాన్ (Gurdwara Karte Parwan) అధ్యక్షుడు గుర్నామ్ సింగ్‌ నివాసానికి చేర్చగలిగారు. అక్కడ వీరు తమ మతాచారాల ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. 


Updated Date - 2022-06-18T22:47:31+05:30 IST