రోగనిరోధక శక్తి అవసరం!

ABN , First Publish Date - 2020-06-01T05:30:00+05:30 IST

రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వాళ్లు వైర్‌సలను తట్టుకుని నిలబడతారు. అదే వైరస్‌ రోగ నిరోధక శక్తి సరిపడా లేని వారిలోకి ప్రవేశించిందే అనుకోండి... శరీరవ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్కోసారి దానివల్ల ప్రాణాపాయమే ఏర్పడుతుంది. అందుకే పెద్దలతో పాటు పిల్లలకు కూడా రోగ నిరోధక శక్తి గురించిన అవగాహన ఉండాల్సిందే. అసలు మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది?...

రోగనిరోధక శక్తి అవసరం!

రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వాళ్లు వైర్‌సలను తట్టుకుని నిలబడతారు. అదే వైరస్‌ రోగ నిరోధక శక్తి సరిపడా లేని వారిలోకి ప్రవేశించిందే అనుకోండి... శరీరవ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్కోసారి దానివల్ల ప్రాణాపాయమే ఏర్పడుతుంది. అందుకే పెద్దలతో పాటు పిల్లలకు కూడా రోగ నిరోధక శక్తి గురించిన అవగాహన ఉండాల్సిందే. అసలు మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. దానికి చాలా కారణాలే ఉన్నా, కొన్ని మౌలికమైన కారణాలు తెలుసుకోగలిగితే చాలు. వాటిల్లో శరీరంలో మలినాలు పేరుకుపోవడం మొదటిది. శరీరంలో శక్తి నిల్వలు తగ్గిపోవడం రెండోది. శరీరంలో మలినాలు పేరుకుపోవడానికి ఆహారంలో పీచుపదార్థం లేకపోవడం ఒక కారణంగా పోషకాహార నిపుణులు చెబుతారు.


ఇక శక్తి నిల్వలు తగ్గిపోవడానికి ఆహారంలో పోషకాలు కొరవడటమే కారణం. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకుని పెద్దలతో పాటు పిల్లలు కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి విటమిన్‌- సిలో ఎక్కువగా ఉంటుంది. కావున విటమిన్‌-సి లభించే ఉసిరి, నిమ్మ, బత్తాయి, కమలాపండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటన్నిటితో  పాటు శరీరానికి శ్రమ కలిగించే పనులు, ఆటలు, లేదా వ్యాయామాలు విధిగా చేయాలి. ఎందుకంటే శారీరక శ్రమ లేకపోతే తిన్నవి ఒంటికి పట్టవు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం... వైర్‌సల బారిన పడటం ఉండదు. ఇవేవీ అర్థం కానంత పెద్ద విషయాలేమీ కాదు కాబట్టి తల్లితండ్రులు పిల్లలకు ఆ అవగాహన సునాయాసంగానే కలిగించవచ్చు.


Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST