సిగ్నల్‌ లేక సేవలకు అంతరాయం

ABN , First Publish Date - 2021-05-17T04:47:09+05:30 IST

క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అవసరమైన అనేక సేవలను చేసేందుకు ప్రభుత్వం సచివాలయాలను ఏర్పాటు చేసిం ది.. అయితే దీనికి అవసరమైన సదుపాయాల కల్పన చేపట్టకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. సచివాలయాలకు అతి ముఖ్యమైన సిగ్న ల్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వివిధ శాఖల ద్వారా చేస్తున్న సేవల్లో అంతరాయం కలుగుతోంది.

సిగ్నల్‌ లేక సేవలకు అంతరాయం

ఇబ్బందిపడుతున్న సచివాలయాల సిబ్బంది

 మెళియాపుట్టి,మే 16: క్షేత్రస్థాయిలోనే ప్రజలకు అవసరమైన అనేక సేవలను చేసేందుకు ప్రభుత్వం సచివాలయాలను ఏర్పాటు చేసిం ది.. అయితే దీనికి అవసరమైన సదుపాయాల కల్పన చేపట్టకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. సచివాలయాలకు అతి ముఖ్యమైన సిగ్న ల్‌ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వివిధ శాఖల ద్వారా చేస్తున్న సేవల్లో అంతరాయం కలుగుతోంది. దీంతో సేవల్లో జాప్యం జరుగుతుండడంతో సిబ్బంది, ఇటు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, ఇతర సేవలను ఆన్‌లైన్‌ చేయించాల్సి ఉండడం, సిగ్నల్‌ సమస్యతో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలో కేరాశింగి, ఇలాయిపురం, వెంకటాపురం సచివాలయాలకు పూర్తిగా సిగ్నల్స్‌ రాక సిబ్బంది రోడ్లపైకి వచ్చి సేవలు చేయాల్సి వస్తోంది. మారుమూల గ్రామాలు కావడంతో సిగ్నల్స్‌ అందడం లేదని, దీంతో సేవలకు ఆటంకం కలుగుతోందని కార్యదర్శి తవిటినాయడు చెబుతున్నారు. కొన్ని సందర్భా ల్లో కొండలపైకి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-05-17T04:47:09+05:30 IST