సిగ్నల్‌ ఫీచర్స్‌ సూపర్‌

ABN , First Publish Date - 2021-01-23T05:45:08+05:30 IST

వాట్సప్‌ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసిన మరుక్షణం నుంచే వినియోగదారులు అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్ల వైపు దృష్టిసారించారు.

సిగ్నల్‌ ఫీచర్స్‌ సూపర్‌

వాట్సాప్‌ కంటే మెరుగు!


వాట్సప్‌ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసిన మరుక్షణం నుంచే వినియోగదారులు అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్ల వైపు దృష్టిసారించారు. చాలాకాలం నుంచి వాట్సప్‌కు ఎంతోకొంత పోటీ ఇచ్చేస్థాయిలో  ‘టెలిగ్రామ్‌’ ఉంది. దీనికి ‘సిగ్నల్‌’ కూడా తోడయింది. వాట్సప్‌పై అపనమ్మకం పెరుగుతున్న కొద్దీ  ఇతర చాటింగ్‌ యాప్స్‌వైపు జంప్‌ అయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిగ్నల్‌ అదనపు ఫీచర్లు ఇవి.....


వర్చ్యువల్‌ నంబర్‌తో రిజిస్ట్రేషన్‌

సిగ్నల్‌  డిజిటల్‌ ప్రొఫైల్‌ కోసం వినియోగదారుల కాంటాక్ట్‌ బుక్‌ లేదంటే ఫోన్‌ నంబర్‌ లింక్‌ను అడగదు. మొదట రిజిస్ట్రేషన్‌ కోసమే ఫోన్‌ నంబర్‌ అవసరమవుతుంది. అదీ ఓటీపీ వెరిఫికేషన్‌ కోసం అడుగుతుంది. ఇందుకోసం ఏదైనా వర్చ్యువల్‌ నంబర్‌ యాప్‌ని వాడుకోవచ్చు. అలా వచ్చిన పిన్‌ నంబర్‌ సహాయంతో అకౌంట్‌ను వినియోగదారులు తమ  ఆధీనంలోకి తీసుకోవచ్చు.


నో ఫొటో, రియల్‌ నేమ్‌

మరింత పటిష్టమైన ప్రైవసీ కోసం మీ ఒరిజినల్‌ ఫొటోను సిగ్నల్‌లో డిస్‌ప్లే పిక్చర్‌గా ఉపయోగించకున్నా ఇబ్బంది లేదు. అలాగే మీ అసలు పేరునూ వాడనవసరం లేదు. వాట్సా్‌పలోనూ ఇదే పని చేయవచ్చు. అయితే అప్పటికే డిజిటల్‌ ప్రొఫైలతో మీ ఫోన్‌ నంబర్‌ డేటాలో స్టోర్‌ అవుతుంది. వెన్వంటనే పేరు, నంబర్‌ మార్చినప్పటికీ అది అంతగా ప్రభావం చూపబోదు. 


ప్రైవసీ సెట్టింగ్స్‌లోనే పిన్‌, రిజిస్ట్రేషన్‌

మీ ఫోన్‌ నంబరుతో సిగ్నల్‌ అకౌంట్‌ లింక్‌ కాదు. పిన్‌తో లింక్‌ కావడం, అదీ మీకు తెలియడమే ఈ వ్యవహారంలోని బ్యూటీ అన్న మాట. ఫలితంగా  ఈ పద్ధతిలో ట్రాకింగ్‌ చాలా కష్టం. మరింత భద్రత కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ‘రిజిస్ట్రేషన్‌ లాక్‌’ను టర్న్‌ చేయవచ్చు. దీంతో మరో డివైజ్‌ నుంచి అనధికారికంగా యాక్సెస్‌ అయ్యే వీలు ఉండదు. 


డిజేబుల్‌ కాంటాక్ట్‌ ఫొటోస్‌: అపియరెన్స్‌ సెట్టింగ్‌లోని ‘యూజ్‌ సిస్టమ్‌ కాంటాక్ట్‌ ఫొటో్‌స’లోకి వెళ్ళి దాన్ని డిజేబుల్‌ చేసేయండి. దీంతో డిఫాల్ట్‌గా కాంటాక్ట్‌ బుక్‌ పిక్చర్స్‌  కనిపించవు.

 

‘ఐపి అడ్రస్‌’ వెల్లడి కాదు: ప్రైవసీ సెట్టింగ్స్‌ కింద రీడ్‌ రిసీట్స్‌ను డిజేబుల్‌ చేయండి. ‘ఆల్వేస్‌ రిలే కాల్స్‌’ని టర్న్‌ ఆన్‌ చేయండి. తద్వారా మీ కాంటాక్ట్‌కు సంబంధించిన ఐపి చిరునామా వెల్లడి కాదు. అదేవిధంగా అనుచిత మెటాడేటా సమాచారాన్ని కూడా ఎలిమినేట్‌ చేయవచ్చు.

 

ఐ ఫోన్‌ వినియోగదారుడైతే: మీరు ఐ ఫోన్‌ వినియోగదారుడైన పక్షంలో ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ‘షో కాల్స్‌ ఇన్‌ రీసెంట్‌’ను డిజేబుల్‌ చేయండి. దీంతో కాల్‌ హిస్టరిలో సిగ్నల్‌ వాయిస్‌, వీడియో కాల్స్‌ కనిపించవు.


స్ర్కీన్‌ టైమ్‌ఔట్‌: అనుచిత చాట్‌ యాక్సె్‌సను నిరోధించేందుకు ‘స్ర్కీన్‌ టైమ్‌ఔట్‌’ను  కనీసం ఒక నిమిషానికి సెట్‌ చేసుకోండి. దీంతో సిగ్నల్‌ యాప్‌ లాక్‌ అవుతుంది. ఇతరులకు అనుచితంగా యాక్సెస్‌ లభ్యం కాదు. 


డిజేబుల్‌ ‘అలౌ ఫ్రమ్‌ ఎనీఒన్‌’: ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ‘అలౌ ఫ్రమ్‌ ఎనీఒన్‌’ ఆప్షన్‌ను డిజేబుల్‌ చేయండి. సిగ్నల్‌ ద్వారా అపరిచితులు మిమ్మల్ని కాంటాక్ట్‌ చేయకుండా కాపాడుకోవచ్చు. 


‘డీబగ్‌ లాగ్‌’: మరింత ప్రైవసీ కోసం అడ్వాన్స్‌డ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డీబగ్‌ లాగ్‌ను డిజేబుల్‌ చేసుకోండి.


సేఫ్టీ నంబర్‌: సిగ్నల్‌లో చాట్‌ చేయడానికి ముందే ప్రతి కాంటాక్ట్‌ను ముందుగానే చెక్‌ చేసుకోండి. ఎవరితో పడితే వారితో ఛాట్‌ చేయకుండా జాగ్రత్తపడవచ్చు.


అయిదు, పది సెకండ్లే: వాట్సా్‌పతో పోల్చుకుంటే సిగ్నల్‌లో డిజపియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌ చాలా మెరుగ్గా పని చేస్తుంది. సిగ్నల్‌లో ఒక పార్టీ ఈ ఆప్షన్‌ వినియోగిస్తే, మరో పార్టీ కూడా తప్పనిసరిగా ఫాలో కావాల్సి ఉంటుంది. దీన్ని అయిదు సెకండ్లకు ఉపయోగించుకోవచ్చు. 

Updated Date - 2021-01-23T05:45:08+05:30 IST