ఆర్జీ-1 జీఎం కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-10-27T06:28:15+05:30 IST

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు.

ఆర్జీ-1 జీఎం కార్యాలయం ముట్టడి
పోలీసుల అదుపులో ఉన్న కార్మిక కుటుంబాలు

- నష్టపరిహారం చెల్లించాలని కార్మిక కుటుంబాల డిమాండ్‌ 

- అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

గోదావరిఖని, అక్టోబరు 26: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆర్‌జీ-1 జీఎం కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తు న్న కార్మిక కుటుంబాలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఏడాదిన్నర క్రితం ఓసీపీ-1లో బ్లాస్టింగ్‌లో మరణించిన కార్మిక కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, కరోనా సమయంలో విధి నిర్వహణలో మృతిచెందిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు జీఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జీఎంకు వినతిపత్రం ఇస్తామన్నా వినకుండా పోలీసులు బలవంతంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని లాక్కెళ్లారు. ఈసందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారి ని బలవంతంగా పోలీసులు తీసుకెళ్లడం హేయమైన చర్య అని, బ్లాస్టిం గ్‌లో రెండు కళ్లు కోల్పోయిన కాంట్రాక్టు కార్మికున్ని కూడా బలవంతంగా జీపులో తోసివేయడాన్ని ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, ధర్నా చేసే హక్కు కూడా లేకపోయిందని, తమకు న్యాయం కావాలని అడగడానికి వచ్చిన కార్మిక కుటుంబాలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈఆందోళనలో సీఐటీయూ నాయకులు మధు, వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్‌, మహేష్‌, సత్యనారాయణ, సతీష్‌, రాజమౌళి, విలాసిని, సౌజన్య, శ్రావణి, రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:28:15+05:30 IST