5న ప్రధాని ఇంటి ముట్టడి: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2022-07-31T10:22:14+05:30 IST

న్యూఢిల్లీ, జూలై 30: నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఆగస్టు 5న దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. నిరసనల్లో భాగంగా అదే రోజు

5న ప్రధాని ఇంటి ముట్టడి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జూలై 30: నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ఆగస్టు 5న దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. నిరసనల్లో భాగంగా అదే రోజు ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించింది. ప్రధాని ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను పార్టీ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌లకు, సీనియర్‌ నేతలకు అప్పగించింది. ఉభయ సభల్లో ఉన్న కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ నిర్వహిస్తారని పేర్కొంది. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్‌భవన్‌లను ముట్టడిస్తారని వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని, పార్టీ నేతలంతా నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. 

Updated Date - 2022-07-31T10:22:14+05:30 IST