మేనేజ్-సమున్నతి అగ్రి స్టార్టప్స్ అవార్డు అందుకున్న సిద్స్ ఫామ్

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫామ్‌కు తెలంగాణలో అత్యుత్తమ

మేనేజ్-సమున్నతి అగ్రి స్టార్టప్స్ అవార్డు అందుకున్న సిద్స్ ఫామ్

హైదరాబాద్:  తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫామ్‌కు తెలంగాణలో అత్యుత్తమ అగ్రి స్టార్టప్‌గా గౌరవం లభించింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌)తో కలిసి చిన్నకారు రైతుల కోసం దేశంలోని అగ్రగామి ఓపెన్‌ అగ్రి నెట్‌వర్క్‌, సమున్నతి అవార్డును అందుకుంది.


సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి ఈ అవార్డును కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి  శోభాకరంద్లాజే చేతుల మీదుగా అందుకున్నారు. సాంకేతిక ఆవిష్కరణల ద్వారా రైతులకు మద్దతు అందించడంతో పాటుగా వ్యవసాయ అభివృద్ధి వాతావరణ వ్యవస్థ పునర్నిర్మాణానికి అంకితమైన అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ను గుర్తించేందుకు  మేనేజ్‌–సమున్నతి అగ్రి స్టార్టప్‌ అవార్డులను అందిస్తున్నారు. రైతులతో భాగస్వామ్యం, పరిష్కారానికి సంబంధించి కంపెనీ సాధించిన పురోగతికి అదనంగా నామినేట్‌ చేసిన స్టార్టప్‌  ద్వారా పరిష్కరించిన సమస్యల తీవ్రతను పరిగణలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేస్తారు.


అవార్డు అందుకున్న సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ..  నాణ్యత, వినియోగదారుల లక్ష్యిత కార్యకలాపాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రజల సంస్థగా నిలపడంలో తమకు సహకరించిన తమ రైతు భాగస్వాములు, మా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. కాగా, మేనేజ్‌- సమున్నతి నిర్వహించిన ద్వితీయ అవార్డుల వేదిక ఇది. మొత్తంగా 32 అవార్డులు అందించగా అందులో మూడు జాతీయ, 27 రాష్ట్ర స్థాయి, రెండు మహిళా వ్యాపారవేత్తలకు కేటాయించారు.  

Updated Date - 2022-09-28T05:30:00+05:30 IST