ఖైదీనంబర్ 241383@ Navjot Singh Sidhu జైలులో డిన్నర్ చేయలేదు...

ABN , First Publish Date - 2022-05-21T14:46:39+05:30 IST

ఓ ఘర్షణ కేసులో దోషి అయిన పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu)కు పాటియాలా కేంద్ర కారాగార అధికారులు ఖైదీనంబరు 241383 కేటాయించారు....

ఖైదీనంబర్ 241383@ Navjot Singh Sidhu జైలులో డిన్నర్ చేయలేదు...

పాటియాలా: ఓ ఘర్షణ కేసులో దోషి అయిన పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu)కు పాటియాలా కేంద్ర కారాగార అధికారులు ఖైదీనంబరు 241383 కేటాయించారు. సిద్దూ మొదటిరోజు జైలులో ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కేవలం కొన్నిటాబ్లెట్లు మాత్రమే వేసుకున్నారని ఓ జైలు అధికారి చెప్పారు.వైద్యుడు సిద్దూకు ప్రత్యేక భోజనం తినాలని సలహా ఇస్తే అతను జైలు క్యాంటీన్ నుంచి కొనాలని, లేదా స్వయంగా వండుకోవచ్చని జైలు అధికారులు చెప్పారు. సిద్ధూకు కఠిన కారాగార శిక్ష పడినందున జైలు మాన్యువల్ ప్రకారం పని చేయాల్సి ఉంటుందని, దీనికోసం మొదటి మూడు నెలలు వృత్తి శిక్షణ ఇస్తామని జైలు అధికారులు చెప్పారు. జైలు మాన్యువల్ ప్రకారం నైపుణ్యం లేని ఖైదీకి రోజుకు 40 రూపాయలు, నైపుణ్యం ఉన్న ఖైదీలకు రోజుకు రూ.60 ఇస్తారు. 


సిద్ధూకు మాతా కౌశల్య ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం అతనికి కేటాయించిన జైలు బ్యారక్‌కు పంపించారు. సిద్దూ ఎంబాలిజం, కాలేయ వ్యాధులతో బాధపడుతున్నాడని అతని మీడియా సలహాదారు సురీందర్ డల్లా చెప్పారు. సిద్దూ ఢిల్లీలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ చికిత్స పొందారని డల్లా పేర్కొన్నారు. ‘‘డీప్ వీన్ థ్రాంబోసిస్ కండీషన్ కారణంగా సిద్ధూ కాళ్లకు పెద్ద ప్లాస్టిక్ బ్యాండ్‌లు ధరించాలి, తద్వారా క్లాట్ ఏర్పడకుండా ఉంటుంది, సిద్ధూ తన ఆరోగ్య సమస్యల కారణంగా ప్రతిరోజూ చాలా మందులు తీసుకోవలసి ఉంటుంది’’అని డల్లా చెప్పారు. అలాగే గోధుమ పిండితో కూడిన ఆహారాన్ని తీసుకోవద్దని సిద్ధూకు సూచించినట్లు ఆయన మీడియా సలహాదారు తెలిపారు. 


Updated Date - 2022-05-21T14:46:39+05:30 IST