Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 31 May 2022 15:32:13 IST

అంత్యక్రియలు: తనకిష్టమైన tractorపై singer Sidhu మృతదేహం

twitter-iconwatsapp-iconfb-icon
అంత్యక్రియలు: తనకిష్టమైన tractorపై singer Sidhu మృతదేహం

చండీగఢ్: పంజాబీ సింగర్(Punjabi Singer) సిద్ధూ మూసెవాలా(Sidhu Moosewala) అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. సిద్ధూ మృతదేహాన్ని అతడికి ఇష్టమైన ట్రాక్టర్‌పై అంత్యక్రియలకు తీసుకువెళ్తున్నారు. హెచ్ఎంటీ 5911 అనే ట్రాక్టర్.. సిద్ధూకి చాలా ఇష్టమని నెటిజెన్లు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సిద్ధూకి వీడ్కోలు పలుకుతున్నారు. ఆదివారం పంజాబ్‌లోని జవహర్కే అనే గ్రామంలో సిద్ధూని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. పంజాబ్‌లోని 424 మందికి భద్రత ఉపసంహరించిన మర్నాడే ఈ హత్య జరగడం గమనార్హం.


కాగా, సిద్ధూని హతమార్చింది తామేనంటూ గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ సోషల్ మీడియాలో ఒక పోష్ట్ షేర్ చేశారు. తడి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. సిద్ధూ హత్యపై పూర్తి బాధ్యత తనతో పాటు సచిన్ బిష్ణోయ్ ధత్తరన్‌వాలి, లారెన్స్ బిష్ణోయ్ గ్రూపులదని చెప్పుకొచ్చాడు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక సిద్ధూ హత్యకు తీహార్ జైల్(Tihar Jail)లో ప్లాన్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ముందు నుంచి అనుమానిస్తున్న లారెన్స్ బిష్ణోయి(Lawrence Bishnoi) గ్యాంగ్‌కు చెందిన కాలాజతేడి, కాలారాణాలను తీహార్ జైలులో ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. కాగా, సిద్ధూ హత్య తమ పనేనన్న కెనడాలో నివసించే గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌కి లారెన్స్ టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై విచారణ వేగవంతం చేశామని పంజాబ్ డీజీపీ పేర్కొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.