కామెడీ షోలో నాటి కంటెస్టెంట్‌...నేడు పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2022-03-11T16:51:47+05:30 IST

కామెడీ షోలో పాల్గొన్న నాటి కంటెస్టెంట్ భగవంత్ మాన్ పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి‌....

కామెడీ షోలో నాటి కంటెస్టెంట్‌...నేడు పంజాబ్ సీఎం

నాటి షో జడ్జి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఓటమితో నవ్వుల పాలయ్యారు...

చండీఘఢ్: కామెడీ షోలో పాల్గొన్న నాటి కంటెస్టెంట్ భగవంత్ మాన్ పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి‌...నేడు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానానికి ఎదగగా, నాటి కామెడీ షో న్యాయనిర్ణేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల్లో ఘోర పరాజయంతో నవ్వుల పాలయ్యాడు. 2006వ సంవత్సరంలో జరిగిన ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ కామెడీ షోలో భగవంత్ మాన్ జోకులు పేలుస్తుండగా, ఆ షో జడ్జీగా వచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పగలబడి నవ్వారు.నాటి కామెడీ షోలో భగవంత్ మాన్ వేసిన జోకులకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెగ నవ్వారు. కానీ ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ సీజన్‌లో నాటి కంటెస్టెంట్ భగవంత్ మాన్ విజేత కాలేదు.


నాటి కామెడీ షోకు జడ్జీగా వ్యవహరించి సిద్దూ మాన్ ను విజేతగా ప్రకటించలేదు. కాని తాజాగా జరిగిన పంజాబ్ ఎన్నికల్లో మాత్రం మాన్ ఘన విజయం సాధించడంతో పాటు తన పార్టీ అయిన ఆప్ కు విజయం సాధించి పెట్టారు. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా మాన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనుండగా, మరో వైపు నాడు జడ్జీగా వ్యవహరించిన సిద్ధూ అధికార కాంగ్రెస్ పార్టీ పేలవమైన పనితీరుతో అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. విధి విచిత్రమంటే ఇదేనేమో. 


Updated Date - 2022-03-11T16:51:47+05:30 IST