Apr 17 2021 @ 10:40AM

'మహా సముద్రం' నుంచి సిద్దార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

సిద్ధార్థ్ ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజీ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సిద్ధార్థ్ ఒక్కసారిగా ఆఫర్స్ తగ్గిపోయి డీలా పడ్డాడు. తెలుగులో 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'కొంచం ఇష్టం కొంచం కష్టం', 'ఓ మై ఫ్రెండ్' లాంటి క్లాసిక్స్ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ గత కొంతకాలంగా సిద్ధార్థ్ సినిమాలకి దూరంగా ఉన్నాడు. ముఖ్యంగా టాలీవుడ్‌లో గ్యాప్ బాగానే వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న 'మహా సముద్రం' సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. యంగ్ హీరో శర్వానంద్ తో కలిసి 'మహా సముద్రం' సినిమా చేస్తుండగా ఈ రోజు సిద్దార్త్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.  

ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సిద్దార్థ్ చాలా దూకుడుగా కనిపించాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన లుక్‌లో మాత్రం సిద్ధార్థ్ చాలా ప్లజెంట్‌గా కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే 'మహా సముద్రం' సినిమాలో సిద్దార్థ్ రోల్‌లో అన్నీ ఎమోషన్స్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో అతిథీరావు హైదరీ.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఆగస్టు 19న 'మహా సముద్రం' భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.