అరుదైన దృశ్యం: సమావేశమైన కెప్టెన్, సిద్ధూ

ABN , First Publish Date - 2021-07-27T23:40:29+05:30 IST

మంగళవారం పార్టీ అధినేత సిద్ధూతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు కుల్జిత్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్, సుఖ్విందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్‌లు అమరీందర్‌ను కలిశారు. అనంతరం ముఖ్యమంత్రికి గురుగ్రంథ్ సాహిబ్ బలి, కోట్కాపుర-బెహ్బల్ కలాన్ వద్ద

అరుదైన దృశ్యం: సమావేశమైన కెప్టెన్, సిద్ధూ

చండీగఢ్: పంజాబ్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దూ కలుసుకున్నారు. మంగళవారం అమరీందర్ నివాసంలో ఈ అపూర్వ కలయికకు వేదికైంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ చాలా కాలంగా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. పరోక్షంగా ఒకరిపై మరొకరు చాలా సార్లు విమర్శలు సైతం చేసుకున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేకనే అమరీందర్ క్యాబినెట్ నుంచి సిద్ధూ బయటికి వచ్చేశారు.


మంగళవారం పార్టీ అధినేత సిద్ధూతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్‌లు కుల్జిత్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్, సుఖ్విందర్ సింగ్ డానీ, పవన్ గోయెల్‌లు అమరీందర్‌ను కలిశారు. అనంతరం ముఖ్యమంత్రికి గురుగ్రంథ్ సాహిబ్ బలి, కోట్కాపుర-బెహ్బల్ కలాన్ వద్ద పోలీసుల కాల్పులు, మూడు వ్యవసాయ చట్టాలతో సహా 18 పాయింట్ల ఎజెండాతో కూడిన లేఖను ఇచ్చారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి అమరీందర్‌ను కోరారు. కాగా రాష్ట్ర కాంగ్రెస్ నూతన నాయకత్వం లేవనెత్తిన అంశాలు ఇప్పటికే ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

Updated Date - 2021-07-27T23:40:29+05:30 IST