సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా తేలికపాటి వర్షం కురుస్తోంది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని లోలెవెల్ వంతెనపై నుండి మోయ తుమ్మెద వాగు ప్రవహిస్తోంది. సిద్దిపేట, హన్మకొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండపోచమ్మ సాగర్‌కు జలకళ మొన్నటి వరకు 4 టీఎంసీలు ఉండగా నిన్న మొన్న కురిసిన వర్షానికి , గోదావరి జలాలను ఎత్తిపోయడంతో 6 టీఎంసీలకు నీరు చేరుకుంది.