సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా

ABN , First Publish Date - 2021-04-17T01:35:28+05:30 IST

సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా

సిద్దిపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా

సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో వివిధ వార్డుల నుంచి పోటీ చేసే  టీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను  మంత్రి హరీష్ రావు  ప్రకటించారు. 4వ వార్డు నుంచి కొండం కవిత - సంపత్ రెడ్డి.. ( జనరల్  మహిళ ), 8వ వార్డు నుంచి వరాల కవిత - సురేష్..( బీసీ మహిళ ) 17వ వార్డు నుంచి మాల్యాల జ్యోతి - ప్రశాంత్ పోటీ చేస్తారని మంత్రి తెలిపారు. అలాగే 31 వ వార్డు జంగిటి కనకరాజు ( బీసీ జనరల్ ) , 34వ వార్డు నుంచి గుడాల సంధ్య -  శ్రీకాంత్ ( జనరల్  మహిళ ), 37వ వార్డు  నుంచి సాకి బాల్ లక్ష్మీ - ఆనంద్ ( ఎస్సీ మహిళ ) లు పోటీ చేస్తారని మంత్రి ప్రకటించారు. 




 సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది.  వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈనెల 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, మే నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. గురువారం ఉదయమే 43 వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులంతా నామినేషన్ల సమర్పణపై దృష్టి పెట్టారు.


తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులకు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం కల్పించారు. 18 వరకు నామినేషన్లు సమర్పిస్తే 22వ తేదీన ఉపసంహరణలు పూర్తయి తుది అభ్యర్థుల జాబితా ఖరారవుతుంది. ఇక 23 నుంచి 28 వరకే అధికారికంగా ప్రచారం చేసుకోవచ్చు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. నడుమ ఒకరోజు మినహాయిస్తే 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. దీంతో పార్టీ టిక్కెట్లపై భరోసా ఉన్న అభ్యర్థులు తమకు అనుకూల రిజర్వేషన్లు రావడంతోనే ప్రచారంలోకి దిగారు. 


ఎన్నికల షెడ్యూల్‌


16-04-2021     నోటిఫికేషన్‌ జారీ

16-04-2021 నుంచి 

18-04-2021 వరకు     నామినేషన్ల స్వీకరణ

19-04-2021     నామినేషన్ల పరిశీలన

20-04-2021     నామినేషన్ల తిరస్కరణ

21-04-2021     అభ్యంతరాల స్వీకరణ

22-04-2021     నామినేషన్ల ఉపసంహరణ

30-04-2021     ఎన్నికల నిర్వహణ

03-05-2021     ఎన్నికల ఫలితాల ప్రకటన


Updated Date - 2021-04-17T01:35:28+05:30 IST