సిద్దిపేట: సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఐసోలేషన్ వార్డులో అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ముందే మంటలను సిబ్బంది మంటలను గమనించడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో ఉన్న ఫర్నిచర్, ఐసోలేషన్ వార్డులో ఉన్న పలు మిషనరీలు దహనం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.