సిద్దిపేట (Siddipet) జిల్లా: కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ (Poojala Harikrishna) అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా, రూరల్ మండలం, పుల్లూర్ గ్రామంలో నిర్వహించిన రచ్చబండ (Rachabanda) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP) చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ధరణి పోర్టల్ (Dharani Portal)ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తుందన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి (Cheruku Srinivas Reddy) మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేట ప్రాంతంలో ఎక్కువ భూములు పంచిందన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ హయాంలో సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదన్నారు. దొరల పాలనకు ఇక్కడి నుంచే చరమగీతం పాడాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి పిలుపిచ్చారు.
ఇవి కూడా చదవండి