కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-29T06:22:12+05:30 IST

పర్యావరణ పరిరక్షణ పద్ధతులు, ఉత్తమ శక్తి పరిరక్షణ పద్ధతులు పాటించినందు కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు ఐఎస్‌వో 14001.2015, 50001.2011 గుర్తింపు పత్రాలు రావడం సంతోషంగా ఉందని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు, కళాశాల కన్వీనర్‌ డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు అన్నారు.

కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు
ఆలపాటి శివయ్య నుంచి ఐఎస్‌వో పత్రాలను అందుకుంటున్న డాక్టర్‌ నాగేశ్వరరావు తదితరులు

 కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

మొగల్రాజపురం, జనవరి 28: పర్యావరణ పరిరక్షణ పద్ధతులు, ఉత్తమ శక్తి పరిరక్షణ పద్ధతులు పాటించినందు కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు ఐఎస్‌వో 14001.2015, 50001.2011 గుర్తింపు పత్రాలు రావడం సంతోషంగా ఉందని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు, కళాశాల కన్వీనర్‌ డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన హైమ్‌ ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఆలపాటి శివయ్య శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పత్రాలను అందించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గరికపాటి దేవలరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:22:12+05:30 IST