సిద్ధాపురం చెరువుకట్టను పటిష్ఠపర్చాలి

ABN , First Publish Date - 2021-12-07T04:49:44+05:30 IST

సిద్ధాపురం చెరువుకట్టను పటిష్ఠపరిచి, శాశ్వత పరిష్కారం చూపాలని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.

సిద్ధాపురం చెరువుకట్టను పటిష్ఠపర్చాలి
పూడ్చివేత పనులను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా

  1.  పెండింగ్‌ పనులను వేగంగా పూర్తిచేయాలి 
  2.  శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి 


ఆత్మకూరు, డిసెంబరు 6: సిద్ధాపురం చెరువుకట్టను పటిష్ఠపరిచి, శాశ్వత పరిష్కారం చూపాలని  మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం చెరువుకట్ట వద్దకు చేరుకొని గండ్లు ఏర్పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. తెలుగుగంగ ఈఈ సుబ్బరాయుడును అడిగి ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెరువుకట్ట నిర్వహణ గాలికి వదిలేయడం వల్లే ప్రస్తుతం గండ్లు ఏర్పడినట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో చెరువుకట్టను పటిష్టపరిచి రాతి రివిట్‌మెంట్‌ చేపట్టాలని సూచించారు. అదేవిధంగా మెయిన, బ్రాంచ కెనాల్‌లకు అనుసంధానంగా పంటకాల్వలను ఏర్పాటు చేయాలని చెప్పారు. చెరువుకట్టపై జంగిల్‌ క్లియరెన్స చేపట్టి సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వివరించారు. ఇదిలావుంటే గతంలో ఇక్కడ ఎన్టీఆర్‌ గార్డెనను ఏర్పాటు చేసి పర్యాటక ప్రదేశంగా రూపొందించేందుకు 17 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామని, ప్రస్తుతం ఈ ప్రక్రియ ఊసే లేకుండా పోయిందని అన్నారు. ఈయన వెంట శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన వంగాల శివరామిరెడ్డి, టీడీపీ నాయకులు మోమిన ముస్తఫా, శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, అబ్దుల్లాపురం బాష, బీ.అన్వర్‌, ఈశ్వరరెడ్డి, శివశంకరశర్మ, జయరామిరెడ్డి, బీ.ఆరీఫ్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-12-07T04:49:44+05:30 IST