Jun 1 2021 @ 04:36AM

సిద్ధాంత్‌.. అనన్యా మరోసారి జంటగా

ప్రస్తుతం షకూన్‌ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యాపాండే కలసి నటిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ మరో చిత్రంలో కూడా  కలసి కనిపించబోతున్నారు. జోయా అక్తర్‌ నిర్మిస్తున్న చిత్రంలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యాపాండే జోడీ ఖరారయిందని బాలీవుడ్‌ సమాచారం. జోయా అక్తర్‌ నిర్మించిన గల్లీ బాయ్‌ చిత్రంలో సిద్ధాంత్‌ చతుర్వేది నటించారు. ఆదర్శ్‌ గౌరవ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అర్జున్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అనన్యాపాండే విజయ్‌ దేవరకొండతో ‘లైగర్‌’ చిత్రంలో నటిస్తున్నారు.