Sep 25 2021 @ 10:56AM

'పుష్ప'లో సిద్ద్ శ్రీరామ్ పాట..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. ఇందులో క్రేజీ సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాట ఒకటి ఉండబోతుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సిద్ద్ శ్రీరామ్ పాడిన పాటలకి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోంది. గత ఏడాది 'అల వైకుంఠపురంలో' పాడిన 'సామజజవరగమన', 'వకీల్ సాబ్' సినిమాలోని 'మగువా మగువా', 'రంగ్ దే'లోని 'నా కనులు ఎపుడూ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లోని 'లెహరాయి' లాంటి సాంగ్స్ ఆయనకి విపరీతమైన క్రేజ్ తీసుకువస్తున్నాయి. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా సిద్ద్ శ్రీరామ్ పాడిన పాటలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.

కాగా ఇప్పుడు 'పుష్ప' సినిమా కోసం సిద్ద్ శ్రీరామ్ ఓ పాట పాడుతున్నట్టు సమాచారం. ఇది మంచి రొమాంటిక్ సాంగ్ అని..కంప్లీట్‌గా రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ మార్క్‌తో ఎంతో హుషారుగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తైందట. ఇటీవల 'పుష్ప' మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' సాంగ్ కొత్త రికాడ్స్ క్రియేట్ చేసింది. మరి సిద్ద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిసున్నారు.