ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2022-08-08T05:37:07+05:30 IST

ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతం

ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతం
వికారాబాద్‌లో ఓ పరీక్ష కేంద్రం వద్ద క్యూలో నిలుచుకున్న మహిళా అభ్యర్థులు

వికారాబాద్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీ్‌స(ఎ్‌సఐ) నియామకానికి ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వికారాబాద్‌ జిల్లాలో 11 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, వికారాబాద్‌లో పది కేంద్రాలు, పూడూరు మండలం ఎన్కెపల్లిలో ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. ఎస్‌ఐ పరీక్షకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 3,778 మంది లో 3,622 మంది హాజరుకాగా, 156 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేశారు. పరీక్ష కేంద్రాలను ఎస్పీ కోటిరెడ్డి సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా బస్‌స్టేషన్లు, కూడళ్లలో పోలీసు యంత్రాంగం హెల్ప్‌ డెస్క్‌లు, రూట్‌ మ్యాప్‌ బోర్డులు ఏర్పాటు చేసి ంది. కొన్ని మార్గాల్లో పోలీసు సిబ్బంది ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించామన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.


  • పిల్లలతో హాజరైన తల్లులు

ఎస్‌ఐ రాత పరీక్షకు ఈ సారి మహిళా అభ్యర్థులు ఎక్కువ సం ఖ్యలో హాజరయ్యారు. చంటి పిల్లలున్న తల్లులు కూడా హాజరయ్యారు. చిన్నారులను కుటుం బసభ్యులకు అప్పగించి మహిళలు పరీక్ష రాసేందుకు వెళ్లారు.


  • మేడ్చల్‌ జిల్లాలో...

కీసర/ఘట్‌కేసర్‌ రూరల్‌: కీసర మండలం చీర్యాల్‌లోని గీతాంజలి కళాశాలలో ఎస్‌ఐ రాత పరీక్ష నిర్వహించారు. చెప్పులు, షూస్‌ను లోపలికి అనుమతిచలేదు. కాగా ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతిచలేదు. ఘట్‌కేసర్‌ మండలంలో 13 కేంద్రాల్లో ఎస్‌ఐ ఉద్యోగార్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ సెంటర్లలో 8,846 మందికి 8,124 మంది ఎస్‌ఐ అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు పేర్కొన్నారు. అరోరా కళాశాల సెంటర్‌ను రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితకృష్ణమూర్తి సందర్శించారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మల్కాజ్‌గిరి ఏసీపీ నరే్‌షరెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - 2022-08-08T05:37:07+05:30 IST