Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎనిమిది మంది ఎస్‌ఐలు బదిలీ

ఏలూరు క్రైం, అక్టోబరు 26 : జిల్లాలో పనిచేస్తున్న ఎస్‌ఐలలో ఎనిమిది మందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మెమో జారీ చేశారు. పోస్టింగ్‌ ప్రాంతాల్లో వెంటనే విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏలూరు వన్‌టౌన్‌ ఎటాచ్‌ డ్‌ ఎస్‌ఐగా ఉన్న వీర్రాజును దెందులూరు ఎస్‌ఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ రామ్‌కుమార్‌ను వీఆర్‌లో ఉంచారు. జిల్లా వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ఏజీఎస్‌ మూర్తిని భీమ వరం టూటౌన్‌కు, ఏలూరు డీసీఆర్‌బీ ఎటాచ్‌డ్‌లో ఉన్న ఎస్‌ఐ లక్ష్మీనారా యణను కొవ్వూరు టౌన్‌కు నియ మించారు. జిల్లా వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ లక్ష్మణబాబును ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు, వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ విష్ణువర్ధన్‌ను ఏలూరు ఎస్‌ఈబీ ఎస్‌ఐగా నియ మించారు. వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ కె.విశ్వనాఽథ్‌బాబును వీరవాసరం ఎస్‌ఐగా నియమించారు. వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ వైవీ నాగేశ్వరరావును నర్సాపురం టౌన్‌లో ట్రాఫిక్‌ క్రమ బద్ధీకరణ కోసం నియమించారు.  


Advertisement
Advertisement