సిద్దిపేట జిల్లాలో ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష

ABN , First Publish Date - 2022-08-08T05:08:22+05:30 IST

జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, వికాస్‌ హైస్కూల్‌, మెదక్‌ రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, సిద్దిపేట పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజ్‌, ప్రతిభ డిగ్రీ కాలేజ్‌లోని ఈ ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సిద్దిపేట జిల్లాలో ప్రశాంతంగా ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష
అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతినిస్తున్న పోలీసులు

280 మంది అభ్యర్థులు గైర్హాజరు

ఆలస్యంగా రావడంతో ఇద్దరికి నో ఎంట్రీ


సిద్దిపేట కైరం, ఆగస్టు 7 : జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌, వికాస్‌ హైస్కూల్‌, మెదక్‌ రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, సిద్దిపేట పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ అండ్‌ పీజీ కాలేజ్‌, ప్రతిభ డిగ్రీ కాలేజ్‌లోని ఈ ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,265 మంది అభ్యర్థులకు 280 మంది గైర్హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక అభ్యర్థి, వికాస్‌ హైస్కూల్‌లో మరో అభ్యర్థి ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతివ్వలేదు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్‌ సిబ్బంది బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులను గంట ముందే బయోమెట్రిక్‌ ద్వారా హాజరు తీసుకుని పరీక్ష కేంద్రంలోకి పంపించారు. సీపీ శ్వేత సిద్దిపేట పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించిన జిల్లా రీజనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బివి.రాజు, పోలీస్‌ జిల్లా నోడల్‌ అధికారి అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, చీప్‌ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్‌ అధికారులు, పోలీస్‌ అధికారులు సిబ్బందిని అభినందించారు.

Updated Date - 2022-08-08T05:08:22+05:30 IST