దారుణానికి పాల్పడ్డ ఎస్సై.. భార్యను వెళ్లగొట్టాలంటే చట్టం అడ్డొస్తోందని..ఇలా అత్యంత కిరాతకంగా..

ABN , First Publish Date - 2021-10-18T01:15:45+05:30 IST

దారుణానికి పాల్పడ్డ ఎస్సై.. కట్టుకున్న భార్యను గర్భవతి అని తెలిసీ..

దారుణానికి పాల్పడ్డ ఎస్సై.. భార్యను వెళ్లగొట్టాలంటే చట్టం అడ్డొస్తోందని..ఇలా అత్యంత కిరాతకంగా..

ఇంటర్నెట్ డెస్క్: ఫేస్‌బుక్ ద్వారా వారు ఒకరికొకరు పరిచయమయ్యారు. అతడి పేరు అలీ. ఉత్తరప్రదేశ్‌ వాస్తవ్యుడు. రైల్వే స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్సులో ఎస్సైగా పనిచేస్తున్నాడు. ఆమె ఓ సాధారణ యువతి. పేరు నజ్మా. 2019లో వారి మధ్య పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారి చివరికి ప్రణయానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమె అతడి ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అతడు మాత్రం కుదరదన్నాడు. నజ్మా అతడిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. దీంతో.. ఉద్యోగం పోతుందని,జైలు పాలు అవ్వాల్సి వస్తుందని భయపడిపోయిన అతడు చివరికి పెళ్లికి ఒప్పుకున్నాడు. 


పెళ్లైన కొంత కాలానికి త్రిపుల్ తలాఖ్ ఇచ్చి ఆమెను వదిలించుకోవాలనేది అతడి ప్లాన్. కానీ ఈలోపే కేంద్ర ప్రభుత్వం త్రిపుల్ తలాఖ్ నిరోధక చట్టం తెచ్చింది. దీంతో.. ఆమెను వదిలించుకునేందుకు అతడికి ఉన్న ఏకైక మార్గం కూడా మూసుకుపోయింది. ఈలోపు నజ్మా గర్భం దాల్చింది. పరిస్థితి చేయిదాటిపోయిందనుకున్న అతడు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. సెప్టెంబర్ 24 ఉదయం ఆమె వాకింగ్ వెళ్లిన సందర్భంలో తన బంధువు వాహనంతో ఆమెను ఢీకొట్టించి హత్య చేశాడు. 


అయితే.. ఘటనాస్థలంలో ఉన్న ఓ వ్యక్తి కారు నెంబర్‌ను గుర్తుపెట్టుకుని పోలీసులకు తెలిపాడు. పోలీసుల దర్యాప్తులో ఆ కారు.. నిందితుడి స్వగ్రామంలో నివసించే ఓ వ్యక్తిదని బయటపడింది. ఈ కోణంలో దర్యాప్తును కొనసాగించిన పోలీసులు చివరకు అలీనే ఈ హత్య చేశాడని తేల్చారు. కాగా.. పెళ్లైన నాటి నుంచీ నజ్మాను ఆమె భర్త కట్నం కోసం వేధించేవాడని బాధితురాలి సోదరుడు పోలీసులకు తెలిపాడు. ఓ ఇల్లును అమ్మి అతడికి రూ.12 లక్షల కట్నం కూడా ఇచ్చామన్నాడు. 

Updated Date - 2021-10-18T01:15:45+05:30 IST