మెదక్ జిల్లాలో ఎస్సై వేధింపులు.. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-16T13:30:12+05:30 IST

ఎస్సై వేధింపులతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

మెదక్ జిల్లాలో ఎస్సై వేధింపులు..  హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

మెదక్: ఎస్సై వేధింపులతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇంకు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై వేధింపులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కానిస్టేబుల్‌ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-06-16T13:30:12+05:30 IST